KTR : హైదరాబాద్ (Hyderabad) లో జరుగుతున్న ప్రపంచ సుందరి (Miss world) పోటీల్లో కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని, ఇది తనకు నచ్చలేదని, అందుకే పోటీల నుంచి తాను తప్పుకుంటున్నానని మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మ్యాగీ (Milla Magi) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (working president) కేటీఆర్ (KTR) స్పందించారు. ఆమెకు చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నానని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
‘మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి. మిల్లా మ్యాగీ గారు మీరు ఒక బలమైన మహిళ. మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాం, గౌరవిస్తాం, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాం. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే’ అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
అంతేగాక ‘దురదృష్టవశాత్తు మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా ఆ బాధ నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నా. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నా. అలాగే మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forums like the Miss World
You are a very strong woman, Milla Magee and I am truly sorry you had to go through this in our state of Telangana
Telangana has a rich culture of… pic.twitter.com/c7Gla3x3yI
— KTR (@KTRBRS) May 25, 2025