KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆర్థిక సహాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు.
కాగా, మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చేరకున్న కేటీఆర్ లక్షెట్టిపేట సమీపంలోని అంకతిపల్లిలోని వాసవీ ఫంక్షన్హాలుకు చేరుకుని రైతు సదస్సులో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు పడుతున్న ఇబ్బందులు, వైఫల్యాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన పనులను వివరించనున్నారు.
లక్షెట్టిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన కేటీఆర్ https://t.co/K9IeKriOoR pic.twitter.com/5khBKkigWR
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026