హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎంఈఐఎల్(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) మేనేజింగ్ డైరెక్టర్ మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి విజయలక్ష్మి సంస్మరణ సభను బుధవారం హైటెక్స్‌లో నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ నెల 5న విజయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు.