హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని చెప్పారు. తమ హయాంలో రైతులపై రూపాయి భారం పడలేదని తెలిపారు. అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించామని వెల్లడించారు. విద్యుత్ చార్జీల పెంపు, ఆదాయ ఆవశ్యకతపై సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ తమ వాదన వినిపిస్తూ.. ప్రజలపై కరెంటు భారం మోపడం సరికాదన్నారు. సిరిసిల్ల నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. విద్యుత్ చార్జీలను 5 రెట్లు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
అన్నిరకాల పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌ను ఒకే గాటున కట్టడం కరికాదని చెప్పారు. చార్జీల పెంపుతో కుటీర పరిశ్రమలపై భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుందని చెప్పారు. ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వెయ్యాలని ఆలోచించడం సమంజసం కాదని చెప్పారు. బాధ్యతగల ఈఆర్సీ ఈ విషయంలో ప్రజలు, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలన్నారు.
ఉచిత విద్యుత్ పేరుతో ఉన్న విద్యుత్‌ను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పది నెలల్లో ఒక వైపు కరెంటు కోతలు.. మరోవైపు చార్జీల మోతలని విమర్శించారు. చార్జీల పెంపును అడ్డుకుంటామని, ప్రజా పోరాటానికి వెనుకాడమన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని విమర్శించారు. అదానీ, అంబానీలకు.. సిరిసిల్ల నేతన్నలకు ఒకే కేటగిరి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత పదేండ్లలో ఆత్మహత్యలు లేవు, కానీ 10 నెల్లలోనే 10 మంది చనిపోయారన్నారు. సీఎం రేవంత్ బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. దీపావళికి ముందే బాంబులు పెళుతాయన్న మంత్రి పొంగులేటి కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్.. అయన పై జరిగిన ఈడి రైట్స్ కావచ్చని ఎద్దేవా చేశారు. ఎం చేస్తారో చేసుకోండని చెప్పారు. ఈ చిట్టి నాయుడు ఏం చేస్తాడని, చిల్లర కేసు పెట్టి జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే అన్నారు. నిజమైన బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడతానా అని చెప్పారు. జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్‌పై ఫైరయ్యారు. ఆయనో రాజకీయ వ్యభిచారని విమర్శించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే ఒకరినొకరు చంపుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.
LIVE: BRS Working President @KTRBRS participates in the Referendum Program on Electricity Tariff Hike in Sircilla. https://t.co/9vboYzGs6a
— BRS Party (@BRSparty) October 25, 2024