KTR Tour in France | ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్‌తో కేటీఆర్ భేటీ
KTR meets with the French Digital Affairs Ambassador | ఫ్రాన్స్ పర్యటనలో తొలిరోజు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్

హైదరాబాద్ : ఫ్రాన్స్ పర్యటనలో తొలిరోజు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్తో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా వంటి అంశాలపై ఫ్రాన్స్ – తెలంగాణ మధ్య పరస్పర సహకారంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మంత్రి కేటీఆర్, ఫ్రెంచ్ రాయబారికి వివరించారు.
అటు తెలంగాణలోని స్టార్టప్ సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఇటు ఫ్రాన్స్‌లోని సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడంపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కే ఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, డైరెక్టర్ ఏవియేషన్ ప్రవీణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

