హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ) : ఫొటో జర్నలిస్టుల సేవలు ఎనలేనివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్లో బుధవారం తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్(టీజీజేఏ) రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సమాజంలోని వాస్తవాలు, ప్రజల కష్టసుఖాలను కెమెరా కంటితో బంధించి, ప్రపంచానికి చాటి చెప్పే ఫొటో జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. వృత్తిపరమైన సవాళ్లను ఎదురొంటూ, అద్భుతమైన చిత్రాలు తీసే ఫొటో జర్నలిస్టులకు అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ మాట్లాడుతూ ఫొటో జర్నలిస్టులు మలిదశ ఉద్యమంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో వారి సంక్షేమం కోసం యూనియన్ పాటుపడుతుందని భరోసా ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ భాసర్ మాట్లాడుతూ టీపీజేఏ 11 ఏండ్ల నుంచి నిరంతరాయంగా ఈ క్యాలెండర్ను ఆవిషరిస్తున్నదని తెలిపారు. ఫొటో జర్నలిస్టుల నై పుణ్యాన్ని వెలికితీసేలా వారు తీసిన అరుదైన ఫొటోలను ఈ క్యాలెండర్ ద్వారా ప్రజలకు పరిచయం చే స్తున్నట్టు పేరొన్నారు. కార్యక్రమంలో టెమ్జు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణకుమార్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, జాయింట్ సెక్రటరీ నవీన్ కుమార్ యార, రాకేశ్రెడ్డి, బాపురావు, చిన్నయాదగిరి గౌడ్, వినయ్ పాల్గొన్నారు.