హైదరాబాద్: తమ కలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో ముందుకెళ్లే యువతకు సహకారం అందించేందుకు అన్నివేళలా ముందుంటాడని మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన హ్యాండ్ బాల్ ప్లేయర్ మడావి కరీనాకు సోమవారం ఆయన ఆర్థిక సహాయం అందించారు.
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కరీనా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఇప్పటికే ఆమె అనేక రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో పాల్గొని మెడల్స్ సాధించింది. ఆసియా యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది.
ఈ నెల 18 నుంచి కజకిస్తాన్ లో జరిగే ఈ పోటీల్లో ఆమె పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కజకిస్తాన్ వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మంత్రి. కే తారకరామారావు దృష్టికి వచ్చింది. ఆమె టోర్నమెంట్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో అందజేశారు. కాగా, మంత్రి కేటీఆర్కు మడావి కరీనాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.