అతనొక్కడే సింగిల్
‘మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా ‘లెనిన్' చిత్రంతో కెరీర్లో మొదటి హిట్‌ను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా ‘లెనిన్’ చిత్రంతో కెరీర్లో మొదటి హిట్‌ను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తాను పనిచేసిన హీరోల్లో ‘ఫ్రెండ్ షిప్, డేటింగ్, మ్యారేజ్’ ఎవరితో చేస్తారని యాంకర్ అడగ్గా.. ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నది.
అఖిల్ అకినేని తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పిన భాగ్యశ్రీ, డేటింగ్, పెళ్లి విషయానికి వచ్చేసరికి రామ్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ తెగ సిగ్గుపడిపోయింది. ‘నేను కలిసి నటించిన కో-స్టార్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.. అతను ఒకడే ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాడు’ అంటూ నవ్వుతూ హింట్ ఇచ్చింది.
దులర్ సల్మాన్, రవితేజ, అఖిల్ వంటి స్టార్స్ సరసన నటించిన భాగ్యశ్రీ, వారిలో పెళ్లి కాని ఏకైక హీరో రామ్ పోతినేని మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పడంతో ఆమె మనసులో ఉన్నది రామేనని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. గత కొంతకాలంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేల మధ్య ఏదో నడుస్తున్నదంటూ సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతున్నది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచే ఈ రూమర్స్ ఊపందుకున్నాయి.
ఈ సుందరి కోసమే రామ్ ఏకంగా లిరిసిస్ట్‌గా కూడా మారాడనే టాక్ ఇండస్ట్రీలో నడిచింది. గతంలో ఈ వార్తలను రామ్ ఖండించినప్పటికీ, భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. పైగా ‘లెనిన్’ ప్రమోషన్స్ సమయంలో ‘హైదరాబాద్ నా రెండో ఇల్లు.. ఆల్రెడీ ఉంది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Bhagyashri Borse
- Lenin
- love
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రేవంత్ పాలనలో పల్లె నుంచి పట్నం వరకు అంతా విధ్వంసమే.. ఆర్బీఐ నివేదికపై కేటీఆర్ ధ్వజం
ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
RC 17 | సుకుమార్ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్.. బరువు తగ్గడం కోసం ప్రత్యేక శిక్షణ!
ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

