BRS MLAs | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు లోక్ భవన్లో గవర్నర్తో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడి చేసిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆధ్వర్యంలో ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్కు వివరించారు.
లోక్ భవన్లో గవర్నర్తో ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల భేటీ
అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు https://t.co/8a91bYhwbk pic.twitter.com/CNe8M6zlX9
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026