Viral News : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో ఓ పెంపుడు కుక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసిన చిరుతపులి (Leopard) ని ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్నది. ఊహించని ప్రతిఘటనతో కంగుతిన్న చిరుతపులి తోకముడిచింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CC Footage) సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.
రుద్రప్రయాగ్‌లోని వికాస్ భవన్ కార్యాలయం సమీపంగల ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. రాత్రి సమయంలో ఓ చిరుతపులి నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో టేబుల్‌పై నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై ఒక్కసారిగా దాడిచేసింది. నోటితో మెడ అందుకుని కిందకు ఈడ్చింది. అయితే ఆ కుక్క ప్రాణభయంతో చిరుతను తీవ్రంగా ప్రతిఘటించింది. కుక్క ప్రతిఘటనను తట్టుకోలేక చిరుత దాన్ని విడిచిపెట్టి పారిపోయింది.
అయినా ఏ మాత్రం భయపడకుండా కుక్క ఆ చిరుతను కొంతదూరం వెంబడించింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు రావడం వీడియోలో కనిపించింది. ఈ దాడిలో పెంపుడు కుక్క ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కానీ స్థానికంగా ఆందోళనలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా జనావాసాల సమీపంలో చిరుత సంచారం ఎక్కువైందని, ఇది జనాలకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రాత్రిపూట గస్తీ పెంచి, చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
Dog takes on leopard during night-time attack in Rudraprayag. Watch video pic.twitter.com/jygCGFN3zP
— NDTV (@ndtv) September 9, 2026