హైదరాబాద్: రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతుంటే, కాంగ్రెస్ దొంగలేమో నీకు ఎంత, నాకు ఎంత అనే వాటాల పంచాయితీల్లో కొట్టుకు చస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదని, బోనస్ బోగస్ అయ్యిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
‘రైతుబంధు లేదు
రుణమాఫీ కాలేదు
బోనస్ బోగస్ అయ్యింది
ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం
అకాల వర్షాలకు
కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో
తడిసి ముద్దవుతుంటే,
వరదకు కొట్టుకుపోతుంటే
రైతన్నలు అరిగోస పడుతున్నరు.
కానీ,
కాంగ్రెస్ దొంగలేమో
నీకు ఎంత
నాకు ఎంత
అనే వాటాల పంచాయితీల్లో
కొట్టుకుచస్తున్నారు!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.