మూసీ లూటీని ఆపేదాకా పోరాటం
‘రేవంత్‌రెడ్డీ..ఇందిరమ్మ పాలన అంటే ప్రశ్నించే ప్రతిపక్ష నేతల గొంతునొక్కడమేనా? లేదంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డిని హౌస్అరెస్ట్ చేయడం దుర్మార్గమని బుధవారం ‘ఎక్స్' వేదికగా ఖండించారు.
- సుందరీకరణ పేరిట రేవంత్‌రెడ్డి చేసే రియల్ ఎస్టేట్ దందాను అడ్డుకుంటం
- గొంతునొక్కుడే ఇందిరమ్మ పాలనా?
- మూసీలో సీఎం కాసుల వేట
- ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ):‘రేవంత్‌రెడ్డీ..ఇందిరమ్మ పాలన అంటే ప్రశ్నించే ప్రతిపక్ష నేతల గొంతునొక్కడమేనా? లేదంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డిని హౌస్అరెస్ట్ చేయడం దుర్మార్గమని బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఖండించారు.
రాష్ట్రంలో ఓ వైపు కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్ల లూటిఫికేషన్‌కు తెరలేపడం సిగ్గుచేటని మండిపడ్డారు. లక్షలాది మంది రైతులు కరువు కోరల్లో నిండా మునిగి కన్నీళ్లు పెడుతుంటే..ముఖ్యమంత్రి మా త్రం మూసీలో మూటల వేట సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూసీలో దోపిడీయే తన తొలి ప్రాధాన్యమని చాటిచెప్తున్న రేవంత్‌రెడ్డి తీరును చూసి 70 లక్షల మంది రైతులు అసహ్యించుకుంటున్నారని నిప్పులుచెరిగారు. మూసీ సుందరీకరణ ముసుగులో కూల్చిన వేలాది కుటుంబాల నివాసాల్లోని భూముల్లో రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకొనేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితుల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్ నేతల గొంతునొక్కే కుట్రలను సహించేదిలేదని తేల్చిచెప్పారు. మూసీలో లక్షన్నర కోట్ల లూటీని ఆపి రోడ్డునపడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

