పంపులు బంద్‌పెట్టి పంటలను ఎండబెట్టిండ్రు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువని నిప్పులు చెరిగారు.
- కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో తెలంగాణ.. రేవంత్ రెగ్యులర్ కాదు.. రెన్యువల్ సీఎం
- కేసీఆర్ తిరిగి వస్తేనే రాష్ట్రం మళ్లీ గట్టెకుతది.. 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ
- పదేండ్ల పాటు మంత్రి పదవిని అనుభవించి అధికారం పోగానే పార్టీ వీడిన ఇంద్రకరణ్‌రెడ్డి
- అవకాశవాదులు పోయినా, పోరాటవాదులే బలం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బీఆర్ఎస్లో చేరిన నిర్మల్ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కండువాలు కప్పి ఆహ్వానించిన రామన్న
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సాగునీటి కొరత, విద్యుత్తు సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా? అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని చెప్పారు.
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా సాగిందని గుర్తుచేశారు. ప్రజలు కొందరు వ్యవస్థ ఎట్లయినా నడుస్తుందనే ధోరణిలో ఉండగా, కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి మూడేండ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తినయ్. కన్నెపల్లి పంపులు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదు. దేవుడు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్‌రెడ్డి అడ్డుపడి మోటర్ల బటన్ నొకకుండా అడ్డుకున్నడు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. నీళ్లందక పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు.
-కేటీఆర్
నీళ్లెత్తాలని సూచించినా వినలే
2026న జూన్ 19న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించినప్పుడు అక్కడ లక్ష క్యూసెకుల నీరు దిగువకు ప్రవహిస్తున్నదని, పంపులు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరం పంపులు ఆన్‌చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పు అని తేలిపోతాయనే భయంతోనే రేవంత్‌రెడ్డి బటన్ నొకడం లేదని విమర్శించారు. దేవుడు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్ అడ్డుపడి బటన్ నొకకుండా అడ్డుకున్నారని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, తెలంగాణలో నీరందక పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్ రెన్యువల్ సీఎం
రైతుల కష్టాలను పరిషరించాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. నెలనెలా ఢిల్లీకి వెళ్లి ఈఎంఐ కట్టడానికే ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని దెప్పిపొడిచారు. ఢిల్లీలో ఈఎంఐ కడితేనే ముఖ్యమంత్రి పదవి రెన్యువల్ అవుతుందని ఎద్దేవాచేశారు. రైతులకు రైతుబంధు పడకపోయినా, రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతున్నదని దుయ్యబట్టారు. కరెంటు సరిగ్గా లేక, యూరియా దొరుకక, రైతుబంధు అందక అన్నదాతలు అరిగోస పడుతున్నారని వాపోయారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగశాలగా, దోపిడీకి వేదికగా మార్చిందని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనతోనే రాష్ర్టానికి భవిష్యత్తు
సినిమా ఇంటర్వెల్ పూర్తయిందని, కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఈ ప్రభుత్వ గడువు మిగిలి ఉన్నదని కేటీఆర్ పేరొన్నారు. తెలంగాణ తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని చెప్పారు. కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ నగేశ్ గెలిచినా నియోజకవర్గానికి సాధించిందేమీ లేదని విమర్శించారు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడారని, అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాటవాదులు బీఆర్ఎస్లోనే ఉన్నారని పేరొన్నారు.
11న నిర్మల్‌లో సభ
నిర్మల్‌లో రామచరణ్ నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఖానాపూర్‌కు చెందిన జాన్సన్ వంటి యువ నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. పార్టీలోకి వచ్చే వారందరినీ ఆహ్వానించాలని సూచించారు. నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ సభలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగించే అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, భూపాల్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ రాథోడ్, కందాల ఉపేందర్‌రెడ్డి, నాయకులు శ్యామ్ సుందర్, వడగంటి రమాదేవి, డాక్టర్ సుభాష్, రాము డాక్టర్ కిరణ్ పాల్గొన్నారు.
కేసీఆర్ వల్లే నిర్మల్ అభివృద్ధి
నిర్మల్ జిల్లా ఏర్పాటు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, మిషన్ భగీరథ నీళ్లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం అన్నీ కేసీఆర్ హయాంలోనే జరిగాయని కేటీఆర్ గుర్తుచేశారు. నిర్మల్ ప్రాంతంలో సాగునీటి సదుపాయాల విస్తరణకు, ఇంటింటికీ తాగునీరు అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాకు ఏం ప్రయోజనం జరిగిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ప్రజలను చీల్చడంలో, కాంగ్రెస్ నేతలు దోచుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

