పోరాట కవియోధుడు దాశరథి
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహానీయుడు, సాహితీవేత్త దాశరథి కృష్ణామాచార్య శత జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. పద్యాన్ని ఆయుధంగా మలిచి పీడిత ప్రజలపక్షాన పోరాడిన యోధుడు దాశరథి అని ఎక్స్‌వేదికగా కేటీఆర్, హరీశ్‌రావు కొనియాడారు.
- ఎక్స్‌వేదికగా కొనియాడిన కేటీఆర్, హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహానీయుడు, సాహితీవేత్త దాశరథి కృష్ణామాచార్య శత జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. పద్యాన్ని ఆయుధంగా మలిచి పీడిత ప్రజలపక్షాన పోరాడిన యోధుడు దాశరథి అని ఎక్స్‌వేదికగా కేటీఆర్, హరీశ్‌రావు కొనియాడారు. ప్రజల గొంతుకగా నిలిచి తెలంగాణ బిడ్డల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిన మహాకవి దాశరథి అని పేర్కొన్నారు. సాహితీ రంగంలో విశేష కృషి చేసిన వారికి దాశరథి సాహితీ పురసారాన్ని కేసీఆర్ అందచేయడం ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రతి ఏడాది దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించామని తెలిపారు. ప్రముఖ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతిని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
మధుసూదనాచారి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారికి స్ఫూర్తి నింపడంలో ఆయన రచించిన ‘అగ్నిధార’ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి అన్నట్టుగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా కేసీఆర్ చేశారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాకుంటే తెలంగాణ కవులను గుర్తించే వారు కాదని శ్రీనివాస్‌గౌడ్ వాపోయారు. తెలంగాణ సాధనలో దాశరథి స్ఫూర్తి కనపడుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి,నాయకురాళ్లు తుల ఉమ, ముక్తవరం సుశీలారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

