KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
KTR | పంటలను కాపాడుకోవడానికి ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ మాజీ మంత్రులు అన్నారు.
వనపర్తి : పంటలను కాపాడుకోవడానికి ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన రైతులపై కేసులు ( Farmers Cases ) నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ ( BRS ) మాజీ మంత్రులు అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో కేసులు నమోదైన రైతులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఫోన్లో, మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నేరుగా శుక్రవారం పరామర్శించారు.
మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) మాట్లాడుతూ ప్రభుత్వ చేతగానితనం కప్పి పుచ్చుకోవడానికి రైతులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పంటలకు నీళ్లు వదలాలని రైతులు ధర్నాలు చేస్తుంటే, ఇక్కడి ప్రజా ప్రతినిధులు నీళ్లు వదలబోమని మొండికేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు.
తప్పనిసరి పరిస్థితిలో రైతులు నీళ్లు వదులుకోవాల్సి వచ్చిందని, అది తప్పు కాదని, రైతుల హక్కు అని గుర్తు చేశారు.రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. నీళ్లు వదలనందుకు ప్రజా ప్రతినిధుల మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల మీద పెట్టిన కేసులు ఉప సంహరించుకోవాలని కోరారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే అన్నదాతలు అందరి కోసం పంటలు కాపాడాలని కోరితే అక్రమ అరెస్టులతో అక్రమ కేసులతో వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీపై ఉన్న ద్యాస రైతులపై లేదు అని, పాలమూరు బిడ్డనని చెప్పి ప్రాజెక్టులు పడావ్ పెట్టారని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆధరం,బేధరం ప్రజల పక్షాన నిలబడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

