KRMB | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ):తెలంగాణ, ఏపీలో జిల్లా లు, మండలాలు, గ్రామాల వారీగా ఉన్న జనాభాతోపాటు ఏడాదిపాటు తాగునీటి కోసం ఎన్ని నీళ్లు అవసరమన్న వివరాలను ప్రాజెక్టులవారీగా అందజేయాలని కేఆర్ఎంబీ తెలుగు రాష్ర్టాలకు సూచించింది.
తెలంగాణ, ఏపీకి బుధవారం ప్రత్యేకంగా లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా తాగు, సాగునీటి వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టా ల్సి ఉన్నదని తెలిపింది. 2024-25 కు సంబంధించి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎన్ఎస్ టెయిల్‌పాండ్, పులిచింతల, ప్రకాశం బరాజ్‌ల కింద తాగునీటిని పొందుతున్న జనాభా వివరాలను అందజేయాలని కోరింది. సెప్టెంబర్ 15లోగా వివరాలను అందజేయాలని ఇరు రాష్ర్టాల కు స్పష్టం చేసింది.