కొవిడ్ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలి
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా | కొవిడ్ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోగులకు అవసరమైన మంచి నీటి సదుపాయం కల్పించాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశించారు.

వనపర్తి : కొవిడ్ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోగులకు అవసరమైన మంచి నీటి సదుపాయం కల్పించాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశించారు. సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కొవిడ్ పడకల ఖాళీల వివరాలు ప్రజలకు తెలుపాలన్నారు.
రెండో విడత జ్వర సర్వే త్వరితగతిన పూర్తి చేసి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఇసోలేషన్లో ఉంచి, రోజు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
అదేవిధంగా జిల్లాలో లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఉద్యం 10 దాటినా తరువాత అనవసరంగా రోడ్ పైకి వచ్చిన వారిపై ఫైన్ వేయడంతో పాటు అవసరమైతే వాహనాన్ని స్వాధీం చేసుకోవాలని ఎస్పీకి సూచించారు.
లాక్ డౌన్ పెట్టిన తరువాత జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గిందన్నారు. ఇదే స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని కలెక్టర్ కోరారు. రోహిణి కార్తె వస్తున్నందున ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు.
ఇప్ప్పటి వరకు 1.7 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా వచ్చే అవకాశమున్నందున, వచ్చే 10 రోజులలోగా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, డీహెంఎచ్వో, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ హరీష్, ఆర్ఎం ఓ డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

