UK BRS | ఆమనగల్లు, నవంబర్ 23 : ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని శని వారం ఎన్నుకున్నారు. పార్టీ యూకే సెల్ అధికార ప్రతినిధిగా, నార్త్ ఐర్లాండ్ ఇన్చార్జిగా, సోషల్ మీడియా కన్వీనర్‌గా మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కోట్ల సాయిబాబా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవులు ఇచ్చినందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలకు, ఎన్నారై బీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మచలంకు కృతజ్ఞతలు తెలిపారు.