సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకోం: కూనం నేని
సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
కరీంనగర్ రూరల్, జూన్ 25: సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. గనులను సింగరేణి ఆధ్వర్యంలోనే నడపాలని, ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ పూటకో మాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని చెబుతున్న అబద్ధాలే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా చెప్పడం దుర్మార్గమని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను బీజేపీ సర్కార్ తుంగలో తొక్కి రెండు రాష్ర్టాలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

