భద్రాచలం: భద్రాచలంలోని కూనవరం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.4.65 లక్షలు ఉంటుందని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు కూనవరం రోడ్డులో తనిఖీలు చేపట్టామని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. రెండు బైకులు, సెల్ఫోన్లు సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడి తీసుకెళ్తున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు.