వికారాబాద్, ఏప్రిల్ 7 : ఎస్సీ,ఎస్టీ బాలికలను కులం పేరుతో దూషించి దాడి చేసిన వికారాబాద్ జిల్లా కొత్తగడి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సాయిలతను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం వికారాబాద్ కలెక్టర్ ను ఆదేశించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక, ఎంవీ ఫౌండేషన్ సంస్థలు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా చైర్మన్ స్పందించారు. వికారాబాద్ కలెక్టర్‌కు ఫోన్ చేసి బాలికలపై దాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.