Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో కొరివి బాలకృష్ణ ముదిరాజ్ డాక్టరేట్ సాధించారు. డాక్టర్ కొండా నాగేశ్వరరావు పర్యవేక్షణలో ”ఎన్హాన్సింగ్ సాఫ్ట్ స్కిల్స్ త్రు లిటరేచర్ అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ తెలంగాణ: ఏ స్టడీ” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి బాలకృష్ణ సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు అభినందించారు.