కోరుట్ల రూరల్, మార్చి 6 : జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంతోపాటు ఇంటింటా సర్వే చేసిన సిబ్బందికి వేతనాలు చెల్లింకపోవడం వంటి కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారు. కోరుట్ల ఎంపీడీవో ఓదెల రామకృష్ణను ఇన్చార్జి కమిషనర్‌గా నియమించారు.
సిరిసిల్ల కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం ఝలక్ ; కేకేకు ఎమ్మెల్సీ ఇవ్వాలని హైదరాబాద్‌కు పయనం రావద్దంటూ ఆదేశాలు
సిరిసిల్ల రూరల్, మార్చి 6: సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చిం ది. కాంగ్రెస్ పెద్దలు, నూతన ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కేకే మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరేందుకు గురువారం కాంగ్రెస్ నేతలు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. లాబీయింగ్ కోసం హైదరాబాద్‌కు ఎవరూ రావద్దంటూ అధిష్ఠానం నుంచి సమాచారం రావడంతో నిరాశ చెందారు.