జమ్మికుంట, ఆగస్టు 8: తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సర్వతోముఖాభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంటే, ప్రధాని మోదీ దేశాన్ని నాశనంచేసే దిశగా సాగుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం జమ్మికుంట, వరంగల్ తూర్పు, ధర్మపురి మున్సిపాలిటికి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ఎక్కడైనా పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అసలు బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కులేనే లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తక్కెళ్లపల్లి రాజేశ్వర్‌రావు, అనిల్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.