చిన్న జిల్లాలతోనే పాలన చేరువైంది: కొప్పుల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చిన్నజిల్లాల ఏర్పాటుతోనే పాలన చేరువైందని, ప్రజలకు సుపరిపాలన అందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలను సమర్ధవంతంగా నిర్వహించామని, అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు.
పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చిన్నజిల్లాల ఏర్పాటుతోనే పాలన చేరువైందని, ప్రజలకు సుపరిపాలన అందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలను సమర్ధవంతంగా నిర్వహించామని, అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు.
జిల్లాల ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. స్వరాష్ట్రంలో ప్రజలకు మరింత సేవలు అందించడంతోపాటు ప్రగతిని సాధించాలంటే కొత్త జిల్లాల ఏర్పాటుతో సాధ్యమని భావించిన కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం బస్‌స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

