హైదరాబాద్,మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యాకమిషన్ మీడియా కన్సల్టెంట్‌గా సీనియర్ జర్నలిస్టు ఏ కొండల్గౌడ్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ఇన్చార్జి కార్యదర్శి ఏ దేవసేన మంగళవారం జీవోను విడుదల చేశారు.
పలువురు అదనపు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రెవెన్యూశాఖలో పనిచేస్తున్న 28మందిని బదిలీ చేసి వారికి పోస్టింగ్‌లు కల్పించింది. ఈమేరకు మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో డిప్యూటీ కలెక్టర్ ఆర్ వీ రాధాబాయిని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గురుకుల జాయింట్ సెక్రటరీ గీత బదిలీ
హైదరాబాద్, మే5 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ జాయింట్ సెక్రటరీ గీతను నిజామాబాద్ డీఆర్వోగా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన గురుకుల సొసైటీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న రాజేందర్‌రెడ్డిని సిరిసిల్ల ఆర్డీవోగా, మైనారిటీ సంక్షేమశాఖలో డిప్యుటేషన్‌పై ఉన్న రాజేశ్వరిని నారాయణపేట డీఆర్వోగా, జుబేదున్నీసా బేగంను మహబూబాబాద్ డీఆర్వోగా బదిలీగా చేసింది.