Konda Sushmita | క్యాబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్.. సీఎంను శపించిన కొండా సుస్మిత..!
Konda Sushmita | తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె శాపనార్థాలు పెట్టారు.
Konda Sushmita : తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె శాపనార్థాలు పెట్టారు. తల్లి బర్తరఫ్‌పై స్పందించిన సుస్మిత “నా తల్లికి అన్యాయం జరిగింది. ఆమెపట్ల అనుసరించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది. మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు. నేను రేవంత్ రెడ్డిని శపిస్తున్నా” అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా “నా తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను” అని పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత హోదాలో ఒక వ్యక్తిని ఉద్దేశించినవే తప్ప, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని ఆమె స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన ఓ షెల్ కంపెనీకి తక్కువ ధరకు విలువైన భూములను కేటాయించారని సుస్మిత చేసిన ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. దీనికి తోడు, టికెట్ల కేటాయింపులో నగదు ప్రమేయం ఉందంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ దుమారాన్ని మరింత పెంచాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని, కొండా సురేఖ తొలగింపునకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతోపాటు, చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేశారు. ఈ మేరకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు సిఫార్సులు పంపారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని కొండా సురేఖ గతంలోనే ప్రకటించినప్పటికీ ఆమెపై వేటు తప్పలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

