సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ కిడ్నాప్!
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసులో ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ను పోలీసులు కిడ్నాప్ చేసి, అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసులో ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ను పోలీసులు కిడ్నాప్ చేసి, అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సుమంత్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం సమీపంలో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
బోడుప్పల్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ తనపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారని, తనను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తన ఎడమచేతికి ఫ్రాక్చర్తోపాటు ఇతర గాయాలయ్యాయని హరికృష్ణ ఆరోపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ కేసులో సుమంత్‌తోపాటు రాము, ప్రశాంత్, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తీక్, మహేందర్‌రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. తొలుత మేడ్చల్-మలాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తర్వాత కేసును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

