నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. అనాథ చిన్నారులకు అండ

- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి విశేష స్పందన
- ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి హామీ
- ‘నమస్తే’కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 8: తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో నివసిస్తున్న అనాథ చిన్నారుల దీనస్థితిపై బుధవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. చిన్నారులకు తాము అండగా ఉంటామని ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెంకు చెందిన గుర్రం శ్రీనివాసులు- సువర్ణ దంపతులు మృతిచెందటంతో పిల్లలు సోని (14), వినయ్ (10) లు అనాథలయ్యారు.
నాయనమ్మ పార్వతమ్మతో కలిసి శిథిలమైన ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దీనస్థితిపై నమస్తేలో వచ్చిన ‘అమ్మానాయినలతో పాటే చనిపోయినా బాగుండు’ కథనానికి స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చిన్నారుల ఇంటి నిర్మాణ బాధ్య త తనదేనని ప్రకటించారు. 2 నెలల్లో నిర్మా ణం పూర్తిచేసి, 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు అందజేస్తామని, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశంతో ఎంపీడీవో బండారు యాదగిరి, పంచాయతీరాజ్ ఏఈ సందీప్ చిన్నారుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ముజీబ్ రూ.10 వేలు, హైదరాబాద్ చెందిన మురళి 2 వేలు, బేగంబజార్ ఏఈ సంపత్ రూ.2500, ఇతరులు రూ.2500, మేడ్చల్ జిల్లా కొంపల్లి మాజీ సర్పంచ్ జెమ్మి దేవేందర్ రూ.3వేలు ఆర్థిక సాయం అందజేశారు. స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

