యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ‘నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి తప్పకుం డా ముఖ్యమంత్రి అవుతరు. నా నాలుకపై మచ్చలు ఉన్నయి. నేను అన్నది అవుతది. భవిష్యత్తులో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉన్నది’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి నీటి పారుదల ప నులపై నిర్వహించిన సమీక్షలో ఆయ న మాట్లాడారు. ప్రజలు మూసీ కాలుష్యంతో బాధపడుతున్నారని, హైదరాబాద్ కాలుష్యమే గాక జిల్లాలోని రసాయన కంపెనీ వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల మీద అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై తాను సంతృప్తిగా లేనని, వాటిని రీ డిజైన్ చేయాలని సూచించారు.