Komatireddy Raj Gopal Reddy | హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి గుసగుసలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సభలోనే దీనిపై చర్చించడం హాట్‌టాపిక్‌గా మారింది.
తనకూ మంత్రి పదవి కావాలని రాజ్‌గోపాల్‌రెడ్డి ఇటీవల బహిరంగం గా పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఇదే విషయమై చర్చించి ఉంటారన్ని భావిస్తున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం నేరుగా తన వద్దకు వచ్చిన రాజ్‌గోపాల్‌రెడ్డిని రేవంత్ అభినందించారు.