హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీలో అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాలకే పరిమితం కాకుండా విద్య, రాజకీయ రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. రూ.35 కోట్లతో 50 ఏసీ గదులు, 200 మంది యాత్రికులు ఒకేసారి భోజనం చేసేలా వసతులు కల్పించడం గొప్పవిషయమని పేర్కొన్నారు.