Komatireddy | మునగాల, జూలై 13 : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోక ముడిచారు. విద్యుత్తు సరఫరాపై చర్చకు రావాలన్న సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా పత్రంతో సూర్యాపేట జిల్లా మునగాల విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్దకు గురువారం రాగా, కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఎమ్మెల్యే దహ నం చేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వేసవిలోనూ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి రైతాంగాన్ని అవమానపరిచారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.