సూర్యాపేట, జూలై 12 (నమస్తే తెలంగాణ): గ్రామీణప్రాంతంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త నీలా సత్యనారాయణ కోదాడ పట్టణ పరిధిలోని అనంతగిరి రోడ్డులో కిట్స్ (కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) ఇంజినీరింగ్ కళాశాలను విశాలమైన ప్రాంగణంలో నెలకొల్పారు. అర్హత, అనుభవం గల అధ్యాపకులచే విద్యాబోధన చేయిస్తూ విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. బోధనలో ప్రథమంలో ఉంటూ ప్లేస్మెంట్లలో అగ్రస్థానంలో నిలుస్తున్నది. కన్వీనర్ కోటాలోనే 100శాతం సీట్లను భర్తీ చేసుకుంటుండగా ప్రతి విద్యాసంవత్సరం 350మంది విద్యార్థులు పాస్ఔట్ అవుతుండగా 250కి పైగా విద్యార్థినులు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థినులతోపాటు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుకున్న ప్రతి విద్యార్థినికి రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా అత్యుత్తమ వసతులతో కూడిన హాస్టల్, ల్యాప్‌టాప్ సౌకర్యం ఇక్కడి ప్రత్యేకత.
కిట్స్ ప్రత్యేకతలు .. సాధించిన విజయాలు
సువిశాలమైన అసోసియేషన్ చేయబడిన లైబ్రరీలో 25వేల పాఠ్య పుస్తకాలతో పరిశోధనలకు అవసరమైన జర్నల్స్.. డిజిటల్ లైబ్రరీ సౌకర్యం. విద్యార్థినుల తల్లిదండ్రులకు భరోసానిస్తూ కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి, రుచికరమైన, శుచిశుభ్రతతో కూడిన భోజనం. ప్రాంగణ ఎంపిక శిక్షణలో భాగంగా జేహబ్, టాస్క్ సంస్థలతో అవగాహన ఒప్పందం. నేషనల్ అక్రిడిటేషన్ అసిస్టెంట్ కౌన్సిల్ ద్వారా ప్రత్యేక తరగతుల నిర్వహణ. ఇండస్ట్రియల్ టూర్లు, సెమినార్లు, ఇంటర్న్‌షిప్, మోటివేషన్ తరగతులు, ప్రాంగణ ఎంపికలకు సీఆర్టీ ట్రైనింగ్. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థినులకు నిర్మాణ కంపెనీలలో ఉద్యోగాల ఎంపికలో భాగంగా మెగా ప్రాజెక్టులో ఎనిమిది సాఫ్ట్వేర్లలో శిక్షణ, టెక్నికల్ ఎగ్జిబిషన్ల నిర్వహణ. బొగ్గుగనులలో కార్మికుల భద్రత కోసం కిట్స్ కళాశాల విద్యార్థుల తయారుచేసిన ప్రత్యేక హెల్మెట్, స్మార్ట్ అంబులెన్స్‌కు ప్రత్యేక అభినందనలు వచ్చాయి. విప్రో ఇన్ఫ్రా, ఎకాడమర్, వర్కోహాల్, టాలెంట్ ట్రెక్, స్టార్టెక్, రినెక్స్, స్కిల్ ఇంటర్న్, డాయ్‌కిన్, ఇన్స్పైర్ ఏఐ, ఫోర్వియా తదితర కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు.
ప్రతి విద్యార్థినికి ప్లేస్మెంట్ లక్ష్యంగా బోధన
మా కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి ప్రాంగణ ఎంపికలో ఉద్యోగం లభించాలనే లక్ష్యంతో కిట్స్ ప్రారంభించాము. మొదటి సంవత్సరం నుంచే సిలబస్‌తోపాటు అనుభవంగల అధ్యాపకులచే బోధన చేయిస్తున్నాం. ఫలితంగా 350 మంది విద్యార్థులకు గాను 250 మందికిపైగా ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉంది.
– నీలా సత్యనారాయణ, చైర్మన్, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, కోదాడ
ప్రత్యేక శిక్షణతోనే ప్లేస్మెంట్
ప్రథమ సంవత్సరం నుంచి పాఠ్యాంశాలతోపాటు ప్లేస్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటుచేశారు. సెమినార్లు, మోటివేషన్ తరగతుల ఏర్పాటుతో కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కలిగించారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని నాకు ఇక్కడ చదువుకోవడంతో అకాడమర్ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం లభించడం ఆనందంగాఉంది.
– గాలి శరణ్య, సీఎస్ఈ
అనుభవం గల అధ్యాపకుల శిక్షణతోనే ప్రాంగణ ఎంపిక
కళాశాలలో ప్రథమ సంవత్సరం నుంచే ప్రాంగణ ఎంపిక కోసం యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అనుభవం గల అధ్యాపకులు పాఠ్యాంశాలపై బోధన చేశారు. దీంతో సీఎస్ఈలో ఇంజినీరింగ్ పూర్తికాగానే రైనిక్స్ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం లభించింది. అధ్యాపకులు, కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు.
– రణబోతు దీపికారెడ్డి