KNRUHS | బీడీఎస్, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం.!
KNRUHS : మేనేజ్మెంట్ కోటా కింద బీడీఎస్( BDS), ఎంబీబీఎస్(MBBS) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) పునఃప్రారంభించింది.
KNRUHS : వైద్య విద్యనభ్యసించాలనకుంటున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కింద బీడీఎస్( BDS), ఎంబీబీఎస్(MBBS) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) పునఃప్రారంభించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఆగస్టు 20వ తేదీన ముగిసిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 2వ ఉదయం 6.00 గంటల నుంచి సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల వరకు తిరిగి అందుబాటులో ఉంటుందని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. NEET-UG 2026లో నిర్ణయించిన కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా.. MBBS/BDS మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేఎన్ఆర్యూహెచ్ఎస్ సూచించింది.
🚨 MBBS/BDS Admissions 2026–27 – Management Quota
KNRUHS has reopened online registration for MBBS/BDS admissions under Management Quota in Private Medical & Dental Colleges.
🗓️ Registration: 02 Sept, 6:00 AM to 04 Sept, 2:00 PM
NEET-UG 2026 qualified candidates who meet the… pic.twitter.com/Ij3Oo3tHIp
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) September 1, 2026
మేనేజ్మెంట్ కోటా కోసం ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ చేసుకునేందుకు సెప్టెంబర్ 2 ఉదయం 6.00 గంటల నుంచి సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2.00 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. అభ్యర్థులు https://tspvtmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఆగస్టు 12వ తదీనన కేఎన్ఆర్యూహెచ్ఎస్ వెబ్సైట్లో విడుదల చేసిన సంబంధిత నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌ను పరిశీలించాలని అభ్యర్థులకు విశ్వవిద్యాలయం సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

