హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కేఎల్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఎడ్యుస్కిల్ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ, ఏపీ క్యాంపస్లు సౌత్ సెంట్రల్జోన్లో బెస్డ్ ఫర్ఫార్మింగ్ క్యాంపస్లుగా ఎంపికయ్యాయి.
ఇటీవల సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు రామకృష్ణ, వరప్రసాద్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చాన్స్లర్ కోనేరు సత్యనారాయణ హర్షం వ్యక్తంచేశారు.