మాదాపూర్, జనవరి 7: దేశంలో అగ్రగామి యూనివర్సిటీల్లో ఒకటైన కేఎల్ డీమ్డ్ టు బీ విశ్వవిద్యాలయం మ్యూనిక్ కేంద్రంగా పనిచేసే సెలోనిస్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఒప్పందంలో భాగంగా సెలోనిస్.. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ)ను హైదరాబాద్లోని కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా కేఎల్ డీమ్డ్ టు బీ వర్సిటీ వీసీ పార్థసారథి వర్మ మాట్లాడుతూ సెలోనిస్లో నైపుణ్యం కలిగిన విభాగాల్లో ప్రాసెస్ మైనింగ్ ఒకటని తెలిపారు. ఈ నెల 5న ఇరుసంస్థలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయని చెప్పారు. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు అభ్యాసంతో పాటు తరగతి కార్యక్రమాలు, ఆన్లైన్ సర్టిఫికేషన్, థీసిస్ సపోర్ట్, సాఫ్ట్వేర్ లైసెన్స్లు పొందడం, ఫ్యాకల్టీ రిసెర్చ్ స్కాలర్స్ మొదలైన వారికి ఆన్లైన్ శిక్షణ అందుబాటులో ఉంటుందని వివరించారు.