హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ పూర్వ విద్యార్థి కే రసజ్ఞ 8వ ర్యాంకు సాధించినట్టు కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థ ప్రకటించింది. టాప్-100లో 13 ర్యాంకులు కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థులకు లభించాయని పేర్కొంటూ.. ఆ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపింది.
ఎస్ఆర్ విద్యాసంస్థల ప్రభంజనం ; జేఈఈ అడ్వాన్స్డ్లో రవిచంద్రారెడ్డికి 8వ ర్యాంకు
హనుమకొండ చౌరస్తా, జూన్ 2: జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చౌర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. ఎం రవిచంద్రారెడ్డి 8వ ర్యాంకు, వీ నాగసిద్థార్థ 13,, పీ సాక్షి 40, ఏ అనుశ్రీ 47, బీ సాయి 68, వీ భరణీశంకర్ 90, జీ రాజేశ్ 106, బీ వినోద్ 115, ఎం వెంకటకౌశిక్ 123, ఎస్ పవన్ 204, ఏ సంతోష్ 265, బీ వాగ్దేవి 269వ ర్యాంకు సాధించి జాతీయస్థాయిలో ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టారని వివరించారు. తమ సంస్థల్లో విద్యనభ్యసించినవారు దేశ, విదేశాల్లో ఉన్నతమైన, పదవుల్లో ఉన్నారని చెప్పారు.