హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ డీఎఫ్‌వో పీ కిశోర్, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం ఏడీఎఫ్‌వో ఎస్ శ్రీనాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో ఆదివారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోని ఎస్ఎఫ్వో నుంచి డీఎఫ్‌వో స్థాయి అధికారుల వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మల్టీ జోన్-1 వైస్ ప్రెసిడెంట్‌గా ఎం క్రాంతికుమర్, జాయింట్ సెక్రటరీలుగా జీ శ్రీనివాస్, పీ నర్సింగరావు, మల్టీ జోన్-2 వైస్ ప్రెసిడెంట్లుగా సందన్న, మహమ్మద్ రఫీ, జాయింట్ సెక్రటరీగా వీ సుభాశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్ సురేశ్, ట్రెజరర్‌గా వై ప్రభాకర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఫైర్ డీజీ వై నాగిరెడ్డి అభినందించారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది సంక్షేమానికి కృషి చేయాలని వారిని కోరారు.