‘హైస్పీడ్’ భూ మాయ?
‘ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అనే చందంగా ఉన్నది రేవంత్‌రెడ్డి సర్కార్ తీరు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైలు ఏర్పాటుకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు, ఆదేశాలు రాకముందే.. హడావుడిగా భూములు లాకునేందుకు సరార్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. ప్రాజెక్టు పేరుతో రైతుల భూములు కొట్టేయడానికి కుట్ర పన్నుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
- అధ్యయన దశలోనే బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్
- అప్పుడే భూ సేకరణ షురూ చేసిన రాష్ట్ర సర్కార్
- ఏ రాష్ర్టానికీ తాము ప్రతిపాదనలు పంపలేదని తేల్చిచెప్పిన రైల్వే మంత్రి
- కేంద్రం స్పష్టతతో బట్టబయలైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాగోతం
- చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్రంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అనే చందంగా ఉన్నది రేవంత్‌రెడ్డి సర్కార్ తీరు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైలు ఏర్పాటుకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు, ఆదేశాలు రాకముందే.. హడావుడిగా భూములు లాకునేందుకు సరార్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. ప్రాజెక్టు పేరుతో రైతుల భూములు కొట్టేయడానికి కుట్ర పన్నుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సరార్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా చట్టవిరుద్ధమని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం గుట్టు రట్టయింది.
విలువైన భూములు కొట్టేయడానికేనా..
దేశవ్యాప్తంగా హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ రైలు ఏర్పాటుకు ప్రతిపాదనలు, భూసేకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఎలాంటి అలైన్మెంట్ ప్రతిపాదన లేకున్నా, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా హైస్పీడ్ రైలు నెట్వర్కు ప్రధాన హబ్‌ను ఏర్పాటు చేస్తూ, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడ ప్రాంతంలో హైస్పీడ్ రైలు టెర్మినల్ ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు సుమారు 650-800 ఎకరాల వరకు భూమి సేకరించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. అధికారులు అన్నదాతల పొలాల్లో మార్కింగ్ సైతం చేశారు. అయితే ఎందుకు ఈ ముందస్తు భూసేకరణ చేపట్టారు, దీనివల్ల ఎవరికి లాభం?, కేంద్ర పభుత్వం అదేశించకముందే ఎందుకీ హడావుడి అని బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. మరోవైపు హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి ప్రాథమిక అలైన్మెంట్ అధ్యయనం మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నదని, తుదిరూపం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ నిమిత్తం ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ అధికారికంగా ఎలాంటి ప్రతిపాదనలు లేదా ఇండెంట్లు పంపలేదని తేల్చి చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించిన ఈ వాస్తవాలు, రేవంత్ ప్రభుత్వం ముందస్తుగా చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ ఎంతటి అసంబద్ధమో తేటతెల్లం చేస్తున్నది.
భూసేకరణ చట్టవిరుద్ధం..
కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక గ్రీన్‌సిగ్నల్ రాకముందే, రాష్ట్ర సరార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తూ అన్నదాతల పొలాల్లో మారింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే పూర్తి వివరాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులకు అధికారికంగా వివరిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అప్పటివరకు ఎలాంటి భూసేకరణ చేపట్టరాదని నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ, రేవంత్ సరార్ వాటిని విస్మరించి రైతులను భయబ్రాంతులకు గురిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి రైల్వే భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రతిపాదనలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ మూడు మార్గాలకు సంబంధించి ప్రస్తుతం అలైన్మెంట్ అధ్యయనం జరుగుతున్నదని రైల్వే మంత్రి స్పష్టం చేసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.అలైన్మెంట్ ఖరారు కాకుండానే హైస్పీడ్ రైలు పేరుతో జరుగుతున్న భూసేకరణ చట్టవిరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని ఈ భేటీతో స్పష్టమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

