హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సహా ఇతర పార్టీ నేతల హౌస్ అరెస్ట్‌ను ఖండించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే వివాదాస్పద జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.