బడంగ్‌పేట, ఆగస్టు5: ఎనిమిదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలో ఆదివారం కలక లం రేపింది. దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపతుల రెండో కుమారుడు మహేందర్‌రెడ్డి ఆదివారం సా యంత్రం ట్యూషన్‌కు వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందా రు. ఎంత వెతికినా ఆచూకీ దొరకక రాత్రి 8 గంటలకు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నట్టు సీఐ నాగరాజు తెలిపారు.
సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఓ బైక్‌పై ఎక్కి వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ వాహ నం నంబర్ ప్లేట్ ట్రేస్ ఔట్ కాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బాలుడి కోసం గాలిస్తున్నారు. విద్యార్థి ఇంట్లో వెళ్లేటప్పుడు రూ.2,000 నగదు తీసుకెళ్లినట్టు తల్లిదండ్రులు చెప్తున్నారని, ట్యూషన్‌కు బాలుడు వెళ్లగా, రాలేదని టీచర్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనేక కోణాల్లో దర్యప్తును ముమ్మరం చేసిన్నట్టు సీఐ నాగరాజు తెలిపారు. విద్యార్థి అదృశ్యమయ్యాడా? కిడ్నాప్ అయ్యాడా అన్నది తేలాల్సి ఉన్నది.