సిద్దిపేట,జూన్22: కిక్ బాక్సింగ్ ఆత్మ రక్షణకే కాకుండా క్రీడారంగంలోనూ రాణించడానికి దోహ దం చేస్తుందని సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు.
కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్ బహూకరించారు. బాలికల విభాగంలో కె శ్రీవర్ధిని గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో సుమారు 30 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారన్నారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈనెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భాగ్యరాజ్, రమేశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.