నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
ఖమ్మం నగరంలో అక్రమంగా నివా సం ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- 19 ఏండ్లుగా ఖమ్మంలో అక్రమంగా నివాసం
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 4: ఖమ్మం నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 ఏండ్ల క్రితం దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఖమ్మం నగరానికి చేరుకొని తప్పుడు సమాచారంతో ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డ్ పొందిన నలుగురు బంగ్లాదేశీయులను ఖమ్మం త్రీటౌన్ పోలీస్ అరెస్ట్ చేశారు.
వారిని విచారించగా బంగ్లాదేశ్‌లోని శ్యామ్కుర్ యూనియన్ జెనైదా జిల్లా మహేశ్పుర్ సబ్ జిల్లా డకాటియాకు చెందిన మహమ్మద్ నూర్‌నబీ అలియాస్ షేక్ నూర్‌నబీ, మహమ్మద్ సాగర్ అలియాస్ బోడ సాగర్, షేక్ జమీర్ అలియాస్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ అమినూర్ మండల్‌గా గుర్తించారు. వీరందరూ 19 ఏండ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగళూరుకు వచ్చారు. అకడే సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవించారు. కోల్‌కతాకు చెందిన మిత్రుడి ద్వారా ఆరేండ్ల క్రితం ఖమ్మం నగరానికి వ చ్చారు. ఇకడే సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మొదటి ముగ్గురు తప్పుడు సమాచారంతో ఆధార్‌కార్డులు పొందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

