గణచతుర్థి నుంచి 9రోజులపాటు భక్తుల పూజలందుకున్న గజముఖుడు గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్‌లో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తకోటి చేసిన నినాదాలు మార్మోగాయి. హుస్సేన్‌సాగర్ తీరాన ఠీవిగా నిలబడిన నూతన సచివాలయం ముందునుంచి ఖైరతాబాద్ బడా గణేశుడు నడిచివస్తుంటే చూసేందుకు రెండు కండ్లూ చాలలేదు. తెలంగాణ పాలనకు దేవతలు దీవెనలు అందిస్తున్నట్టుగా ఉన్నదీ దృశ్యం.