పాత రికార్డులు దగ్ధం!
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలోని రికార్డులు దగ్ధమైనట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే ఎస్ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య ఇటీవల బదిలీ అయ్యాడు.
- గద్వాల ఎస్ఈ కార్యాలయంలో ఘటన
- కీలక పత్రాలను కాల్చివేసినట్టు ఆరోపణలు
గద్వాల, అక్టోబర్ 24 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలోని రికార్డులు దగ్ధమైనట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే ఎస్ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య ఇటీవల బదిలీ అయ్యాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న రికార్డులు కొత్తగా విధుల్లో చేరేవారికి అప్పగించాలి. కానీ అప్పగించకుండా ఎవరూ లేని సమయంలో కార్యాలయానికి చేరుకొని ఫైళ్లు బయటకు తీసుకొచ్చి దగ్ధం చేసినట్లు తెలిసింది.
అయితే బదిలీపై వెళ్లిన వ్యక్తికి కార్యాలయం తాళాలు ఎవరు ఇచ్చారు? ఆ ఉద్యోగి సెలవు రోజు ఎందుకు కార్యాలయానికి వచ్చాడు? ఒక వేళ పనికి రాని ఫైళ్లు అయితే ఆ విషయం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఫైళ్లు ఎందుకు దగ్ధం చేశాడు అనేది అనుమానాలకు తావిస్తున్నది. జూరాల ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు టెండర్ల వివరాలు, కాంట్రాక్టర్లు పనులు చేసిన బిల్లుల వివరాలు, ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులు దగ్ధం కావడంతో చిరు ఉద్యోగిపై ఎవరైనా ఒత్తిడి తెచ్చి దగ్ధం చేయించారా? అనేది తెలియాల్సి ఉన్నది.
కార్యాలయంలో ఉండే ప్రొజెక్టర్, డీఈకి సంబంధించిన ల్యాప్‌టాప్ చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో పీజేపీ ఎస్ఈ కార్యాలయ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పీజేపీ డీఎస్ఈ ప్రభాకర్‌రెడ్డి విచారణ ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

