హైదరాబాద్, ఏప్రిల్23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఇరిగేషన్‌శాఖలో కీలక పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీ జనరల్‌గా గుమ్మడి అనిల్‌కుమార్, అడ్మిన్‌గా అమ్జద్ హుస్సేన్, ఓఅండ్ఎం ఈఎన్సీగా టీ శ్రీనివాస్‌ను నియమించింది. అలాగే ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ జనరల్‌గా మురళీధర్‌ను ప్రభుత్వం నిరుడు తొలగించి, ఈఎన్సీ అడ్మిన్ అనిల్‌కుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. తాజాగా పూర్తిస్థాయిలో ఈఎన్సీ జనరల్‌గా అనిల్‌కుమార్, ఈఎన్సీ అడ్మిన్‌గా అమ్జద్ హుస్సేన్‌కు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ విజయభాస్కర్‌రెడ్డి మార్చి 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ సీఈ టీ శ్రీనివాస్‌ను ఈఎన్సీగా ప్రమోషన్ కల్పించింది. అలాగే ఎస్ఈ, వనపర్తి సీఈగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఏఎస్ఎన్రెడ్డిని నాగర్‌కర్నూల్ సీఈగా ప్రభుత్వం నియమించింది.