హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు కేరళలో ఓవైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడిని అరెస్టు చేసి, హైదరాబాద్కు తరలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రామచంద్రభారతికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించడంతోపాటు ఎమ్మెల్యేల కొనుగోలులో సదరు వైద్యు డు మధ్యవర్తిగా వ్యవహరించాడని సిట్ గుర్తించినట్టు తెలిసింది. కొచ్చి లోని వైద్యుడి నివాసం, కార్యాలయాల్లో ఆదివారం సిట్ అధికారులు సోదాలు జరుపగా, పలు కీలక ఆధారాలు లభించాయని సమాచా రం. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఇతర రాష్ర్టాలకు వెళ్లిన సిట్ బృందాలు కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యాయి.