హైదరాబాద్, జూలై 24 (నమస్తేతెలంగాణ) : తన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. గురువారం తన పుట్టినరోజును పురస్కరించుకొని కేటీఆర్ తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులైన కేసీఆర్, శోభమ్మకు కేటీఆర్, శైలిమ పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా నిండునూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్, శైలిమను కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు.
కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే డాడీ. మీలాంటి తండ్రి నాకు లభించడం నా అదృష్టం. తాతయ్యను మీరు గర్వపడేలా చేసినట్టుగా, నేను మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్న.
ఎన్ని జన్మలకైనా మీరే నా తండ్రిగా ఉండాలని కోరుకుంటున్న. మీ సైనికుడిగా, మీ స్నేహితుడిగా, మీరు గర్వించదగిన కొడుకుగా ఎప్పుడూ మీ కోసం ఉంటాను. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం’ అంటూ హిమాన్షు పేర్కొన్నారు.