ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 12: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, ఆయన వెంటే ఉస్మానియా యూనివర్సిటీతోపాటు యావత్ విద్యార్థి లోకం నడుస్తుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీడీ అనిల్ అన్నారు. సోమవారం ఆయన ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. మోదీ పీడను తొలగించుకోవాలంటే కేసీఆర్ జాతీయ పార్టీ నెలకొల్పాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు.